Wednesday 22 June 2016

Inter Advanced Supplementary Results

 Inter Advanced Supplementary Results

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు దాదాపు 3లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారన్నారు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి

 Click here for Inter Supplementary Results 

 Click here for : ntnipuna.com

Thursday 16 June 2016

Telangana (TS) TET RESULTS 2016

 Telangana  (TS) TET RESULTS 2016

హైదరాబాద్ : టీఎస్ టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ సంచాలకులు కిషన్ విడుదల చేశారు. పేపర్ -1లో 54.45 శాతం ఉత్తీర్ణత, పేపర్ -2లో 25.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్ -1లో 134 మార్కులతో స్నేహలత(మెదక్ జిల్లా) మొదటి స్థానంలో నిలిచింది. పేపర్ -2లో 126 మార్కులతో డి. శారదావాణి(కరీంనగర్ జిల్లా) ప్రథమ స్థానంలో నిలిచింది. పేపర్ -1లో కరీంనగర్ జిల్లా ఫస్ట్, రంగారెడ్డి జిల్లా చివరిస్థానంతో సరిపెట్టుకుంది. పేపర్-2లో మ్యాథమెటిక్స్/సైన్స్ విభాగంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం, మెదక్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. పేపర్-2లో సోషల్ స్టడీస్ లో హైదరాబాద్ ఫస్ట్, మెదక్ చివరిస్థానంతో సరిపెట్టుకుంది. టెట్ ఫలితాల కోసం WWW.NAMASTHETELANGAANA.COM వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. మే 22న టెట్ జరిగిన విషయం విదితమే. పేపర్-1లో 87.10 శాతం మంది అభ్యర్థులు, పేపర్-2లో 91.83 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1కు 1,01,213 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 88,158 మంది పరీక్షలు రాశారు. పేపర్-2కు 2,74,339 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,51,924 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.

Wednesday 1 June 2016

Osmania university Degree Results 2016

 OU Degree Results 2016
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీ ఫలితాలను ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ విడుదల చేశారు. మార్చి, ఏప్రిల్‌లో డిగ్రీ వార్షిక పరీక్షలు జరిగిన విషయం విదితమే. ఫలితాల కోసం www.osmania.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
 Click here for : OU Degree Results 2016

Tuesday 31 May 2016

Telangana ICET Results 2016

హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 పరీక్షా ఫలితాలను మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ చిరంజీవులు విడుదల చేయనున్నారు. ఐసెట్-2016 ఫలితాలు www.ntnipuna.com లేదా results.namasthetelangaana.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

Monday 9 May 2016

Telangana 10th Class Exam Results 2016

Telangana State Board Class 10th


Telangana 10th Class Results 2016 will be declared On Tommorrow (11/05/2016) 11:00 am. You can check your results from results.namasthetelangaana.com . Stay tuned with us for more updates. Here we will update direct link to check Telangana SSC Results 2016, TS 10th class Toppers list 2016, Telangana SSC Pass percentage 2016.

Telangana SSC examinations 2016 Results on 12th May

 ssc exam results

హైదరాబాద్ : ఈ నెల 12న టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ సచివాలయం వేదికగా ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించి ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల కోసం www.namasthetelangaana.com ను సంప్రదించవచ్చు.

SSC Public examinations march,2016 results will be released by hon'ble Dy.Chief Minister kadiyam srihari On 12-05-2016 at 11.00 AM at conference Hall of D-block Ground Floor Telangana Secretariat Hyderabad.
 Here You can found Telangana  Board of Secondary Education Results, 10th class results 2016, tenth class results, ssc results


Click here for:  Telangana 10th Class Results 2016

Click here for:  Telangana Tenth Class Results 2016


Tuesday 3 May 2016

Sunday 1 May 2016

నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల


 TS POLYCET 2016 results

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కొరకు గతనెల 21న నిర్వహించిన పాలిసెట్-2016 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 220 పాలిటెక్నిక్ కళాశాలల్లో 53,870 సీట్ల భర్తీకొరకు నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 1,27,972 మంది దరఖాస్తు చేసుకోగా 1,24,584 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు పాలిసెట్ వెబ్‌సైట్‌తోపాటు results.namasthetelangaana.com, ntnipuna.com వెబ్‌సైట్‌లలో కూడా చూడొచ్చు.

Wednesday 27 April 2016

‘పది’ తర్వాత పదిలమైన కోర్సులు

10th class  పరీక్షలు మార్చి 25తో ముగిశాయి. ఈ ఫలితాలపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంది. పది పాసైతే ఉన్నత చదువులు చదవచ్చు. ఉపాధి అవకాశాలు పొందవచ్చు. విద్యార్థి ఎంచుకునే కోర్సులు, వారు తీసుకునే నిర్ణయాలపై కెరీర్ ఆధారపడి ఉంటుంది. మంచి భవిష్యత్ కోసం పదిలమైన కోర్సుల ఎంచుకునేందుకు పిల్లల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. పది అనంతరం వివిధ కోర్సులు, ఉద్యోగావకాశాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
safe course after 10th class


పది తరువాత చదివే కోర్సులు..
రెండు సంవత్సరాలు ఉండే ఇంటర్మీడియట్‌లో రెగ్యూలర్ గ్రూపులు సైన్స్‌లో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్‌లో సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీకోర్స్‌లు చదవవచ్చు. వీటితో పాటు ఒకేషనల్ కోర్సులు తీసుకుని ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హోమ్ సైన్స్, బిజినెస్, కామర్స్, హ్యుమానిటీస్, హెల్త్ అండ్ ఫ్యారా మెడికల్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్, ఐఐటీ లాంటి టెక్నికల్ కోర్సులు చదవవచ్చు. తక్కువ వ్యవధిలో ఉపాధిని పొందవచ్చు..
స్టేట్ ఆఫ్ బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా పాలిటెక్నికల్ కోర్సులు తీసుకోవచ్చు..
ఇవి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటాయి.
ఇంజినీరింగ్ ట్రేడ్‌లు..
ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, సిరమిక్ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్‌ట్రుమెంటేషన్ కోర్స్‌లు..
నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లు..
బయోమెడికల్ ఇంజినీరింగ్, గార్మెంట్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ప్రీ ప్రెస్ ఆపరేషన్, ప్రెస్ వర్క్, ప్రింట్, ఫినిసింగ్ అండ్ ప్యాకింగ్, ఫార్మసీ, ప్యాకింగ్ టెక్నాలజీ, టక్టైల్స్ టెక్నాలజీ, పూట్ వేర్, సుగర్, టెక్నాలజీ కోర్స్‌లు చదివే అవకాశం ఉంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఐటీఐ కోర్సులు..
ఇంజినీరింగ్ ట్రేడ్‌లు..
డ్రాప్టుమెన్(సివిల్), (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోఫ్లాటర్-ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయిన్‌టెనెన్స్, ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్, లేబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), మెషినిస్టు(గైండర్), మెకానిక్(డిజిల్), మెకానిక్ (మోటార్ వెహికిల్), మెకానిక్ (రేడియో అండ్ టీవీ), మెకానిక్ (రిప్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్), మెకానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్, ప్లంబర్, పెయింటర్ జనరల్, టూల్స్ అండ్ డై మేకర్(డై అండ్ మౌంల్డ్స్), టర్నర్-వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) కోర్స్‌లను తీసుకోవచ్చు.
నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లు..
కంప్యూటర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ అండ్ నీడిల్ వర్క్, కంప్యూటర్ ఆపరేషన్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్, డైరింగ్-డాటా ఎంట్రీ ఆపరేటర్, డెక్క్‌టాఫ్ పబ్లిషింగ్ ఆపరేటర్, డ్రెస్ మేకింగ్, డ్రైవర్ కం మెకానిక్(లైట్ మోటార్ వెహికిల్), ఫ్యాషన్ టెక్నాలజీ, ఈవెంట్ మెనేజ్‌మెంట్ అసిస్టెంట్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఎంబ్రాయిడరీ అండ్ నీడిల్ వర్క్, సెక్రెటేరియల్ ప్రాక్టిస్, స్టేనోగ్రఫీ (ఇంగ్లీష్), స్టేనోగ్రఫీ(హిందీ), ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
పారా మెడికల్ కోర్సులు..
పది అనంతరం పారా మెడికల్ కోర్సులను సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు శిక్షణ పొందే వీలుంది. డిప్లొమా ఇన్ ఎంఎల్‌టీ, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, సెర్ట్ కోర్స్ ఇన్ ఈసీజీ టెక్నాలజీ, సెర్ట్ కోర్స్ ఇన్ కార్డియాలజీ టెక్నాలజీ కోర్స్‌లు తీసుకోవచ్చు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్..
పది పాస్ అనంతరం ఉపాధి కోసం క్లరికల్ పోస్టులు, స్టెనోగ్రాఫర్, డిఫెన్స్‌లో సోల్జర్ ఉద్యోగాలు, గ్రూప్-4, రైల్వేలలో కానిస్టేబుల్, పారామిలిటరీ ఫోర్సెస్, డీజీసీఏ స్టూడెంట్ ఫైలట్ లైసెన్స్, బ్యాంక్‌లలో అటెండర్ ఉద్యోగాలు పొందే వీలుంది. 

పది తరువాత పయనమెటు...

ప్రతి విద్యార్థికీ పదో తరగతే కీలకం.. SSC తరువాత వేసే అడుగు సోపధానమైంది. భవిష్యత్ అంతా దాదాపు నిర్ణయమైపోతుంది. ఉపాధి పొందాలన్నా.. ఉద్యోగం సంపాదించాలన్నా.. ఉన్నత స్థాయికి చేరాలన్నా ఇక్కడ తీసుకునే పునాది అవుతుంది. క్రమంలో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతున్న నేటి సమాజంలో ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరితే ఏమవుతుంది..? ఇలా రకరకాల ప్రశ్నలు మదిని తొలుస్త్తుంటాయి. చాలామంది అరకొర సమాచారంతో.. విభిన్న వ్యక్తుల సలహాలతో చెందుతుంటారు. క్రమంలో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలపై అవగాహన చేసుకుని సరైన లక్ష్యం దిశగా పయనిస్తే అనుకున్న విజయాన్ని సాధించవచ్చు. 10th class తరువాత ఏమేం చేయవచ్చో తెలుసుకుందాం.


career-options-after-10th-class


ఇంటర్మీడియట్ : ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా ఇంటర్మీడియట్ అవసరం. ఇంటర్మీడియట్‌లో రకరకాల గ్రూపులు ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడం కూడా ఇంటర్మీడియట్‌లో చేరే ముందు సొంతంగా గ్రూపులను ఎంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి. 10th Class పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలా మందికి ఇంటర్‌లో ఉండే గ్రూపుల గురించి సరైన అవగాహన ఉండదు. ఏ గ్రూపులో ఏ సబ్జెక్టులు ఉంటాయో కూడా తెలియదు. అయితే ఏ గ్రూపులోనైనా చేరే ముందు ఆయా సబ్జెక్టుల వివరాలు తెలుసుకోవడంతోపాటు మనకు అందులో ప్రావీణ్యం ఉందా లేకున్నా భవిష్యత్తులో రాణించగలమా? అనే అంశాలను బేరీజు వేసుకకుని గ్రూపును నిర్ణయించుకోవాలి. 
గ్రూపులు కాంబినేషన్లు ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఎనిమిది కాంబినేషన్లలో చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కూడా ఎక్కువగా వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి. అందులో ప్రధానమైన కొన్ని గ్రూపులు ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్), ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్), హెచ్‌ఈసీ (హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్). ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాంబినేషన్ గ్రూపులు ఉన్నప్పటికీ అవి చాలా తక్కువ కళాశాలల్లో ఉన్నాయి. వీటితోపాటు అక్కడక్కడ హెచ్‌సీఎస్ (హిస్టరీ, సివిక్స్, సోషియాలజీ), హెచ్‌ఈఎం (హిస్టరీ, ఎకనామిక్స్, మ్యూజిక్), హెచ్‌ఈఎస్ (హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ), హెచ్‌సీజీ (హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ), ఈసీపీ (ఎకనమిక్స్, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) గ్రూపులు ఉన్నాయి.

వృత్తివిద్య : ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీయట్ వారధిలాంటిదైతే.. ఉపాధికి వృత్తివిద్య కోర్సులు నిచ్చెన లాంటివి. 10th Class తరువాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలు, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునేవారు సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ లాంటి గ్రూపుల్లో చేరుతారు. అయితే ఇవి కాకుండా వృత్తివిద్య కోర్సుల్లో చేరే విద్యార్థులకు మంచి ప్రయోజనం చేకూరేందుకుగాను అధికారులు ఈ వృత్తివిద్య కోర్సులకు కొత్తరూపునిచ్చారు. ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటి వరకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలు లేని ఈ కోర్సులకు ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు ముద్రించారు.

29 శిక్షణ : రాష్ట్ర స్థాయిలో tenth పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తివిద్య సంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్-ఎస్‌ఐవీఈ) వృత్తివిద్య కోర్సులను అందిస్తోంది. వృత్తివిద్య కోర్సు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలు కల్పించింది. రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారు ఎంసెట్‌కు కూడా హాజరు కావచ్చు. దీనికోసం నిర్దేశించిన బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్, కామర్స్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీలోనూ చేరవచ్చు. ప్రైవేటు కళాశాలల్లో వృత్తివిద్య కోర్సు చేసే ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం బోధనా రుసుం కూడా చెల్లిస్తుంది. 

చేరడం ఎలా..? 10th Results వెలువడిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు దీర్ఘకాలిక (రెండేళ్ల) వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇందులో చేరేందుకు విద్యార్థులు నేరుగా జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జూలై 15వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరానికి రూ.800 ఫీజు చెల్లించాలి. రెండో సంవత్సరం విద్యార్థులు రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. 
మేళాల్లో ఉపాధి అవకాశాలు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్మీయట్ విద్యాశాఖ ఏటా జాబ్ మేళాలు, అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ మేళాల్లో ఎంపికైన వారికి మంచి వేతనంలో ఉద్యోగ అవకాశం అందిస్తుంది. 

పాలిటెక్నిక్ 10th Class తరువాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి సంపాదించాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి పాలిటెక్నిక్ తరువాత ఉన్నత విద్యకు అవకాశం ఉన్నా మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా ఈ పాలిటెక్నిక్ డిప్లమోపైనే ఆధారపడుతారు. ఇంజినీరింగ్ డిప్లమో పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సు అత్యంత ఉత్తమమైనది. ఈ కోర్సు చేయడం మూలాన ఇటు డబ్బు, సమయం రెండూ వృథా కాకుండా సాంకేతిక విద్యను పొందవచ్చు. పారిశ్రామిక రంగంలో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యత లభిస్తుంది. 

మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్, ఐప్లెడ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ) ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్

మూడున్నరేళ్ల కోర్సులు : మెటలార్జికల్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ ఫుట్‌వేర్ టెక్నాలజీ. 

ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లమో కోర్సులు ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యునికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్. 
టీఎస్‌ఆర్‌జేసీ విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం రాష్ట్ర గురుకుల విద్యాలయాలను 1972లో ప్రారంభించింది. పట్టణాలకు, నగరాలకు దూరంగా ఎటువంటి ప్రతిబంధకాలు లేని ప్రాతాల్లో ప్రత్యేక సదుపాయాలు విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పని చేస్తున్నాయి. ఈ మేరకు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో గురుకుల విద్యాలయాలకు పెరుగుతుంది. చేరడానికి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సొసైటీ ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తోంది. నాణ్యమైన విద్య 

సదుపాయాలు రెండేళ్లపాటు ఉచిత విద్య, ఇంటిగ్రేటెడ్ ఎంసెట్ కోచింగ్, ఇంటెన్సివ్ టెస్టింగ్ ప్రోగ్రాం, ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ, (ఈఈటీ-ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సీజీడీఎం-కమర్షియల్ గార్మెంట్ డిజైన్ మేకింగ్), ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల వరకు నగదు బహుమతి అందజేస్తున్నారు.

ఐటీఐ : ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు ఒకటి, రెండేళ్ల కాల వ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ తక్కువ వ్యయంతోనే. దీని వల్ల చిన్న వయస్సులోనే ఉపాధి పొందే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలో ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. tenth class ఒకటి రెండేళ్లపాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు. కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించడం, మానవ వనరుల నైపుణ్యాలను పెంచి పరిశ్రమలకు అందించడం దీని లక్ష్యం. క్రాప్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం (సీటీఎస్) కింద 1950లో ఐటీఐలను స్థాపించారు. 14 నుంచి 40ఏళ్ల మధ్య వయస్కులు ఐటీఐల్లో శిక్షణ పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (ఎన్‌సీవీటీ) అందిస్తుంది. ఈ సర్టిఫికెట్ ఉన్నవారికే ప్రైవేటు సంస్థలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

ప్రవేశం కోసం 10th class ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుం ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. 

SSCతో ఉద్యోగావకాశాలు : 
పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. Tenth తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్థోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. 20ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలో ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందవచ్చు.

సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ పోలీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సీపీఓ (భద్రతా విభాగం)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో ప్రధానంగా ఐదు విభాగాలు ఉంటాయి. 

ఎంపిక విధానం ఈ ఎంపిక మూడు దశలుగా జరుగుతుంది. మెదటి దశ శారీరక సామర్థ్యం పరీక్ష. దీంట్లో పరుగు పందెం, హైజంప్ రెండో దశ రాత పరీక్షకు సంబంధించింది. మొదటి పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో జనరల్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు. మొదటి, రెండవ నెగ్గిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

అర్హత : 10th class ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయస్సు 18నుంచి 23సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతి చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.

త్రివిధ దళాలు దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. 10th class ఆపై అర్హతలు ఉన్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటాయి.

ఇండియన్ ఆర్మీ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి సోల్జర్లు (జనరల్ డ్యూటీ).

అర్హత : కనీసం 45శాతం మార్కులతో 10th class ఉత్తీర్ణులై ఉండాలి. 18నుంచి 21సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులు.

ఎంపిక : కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహించి ఎంపిక చేస్తారు. దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. వాటిలో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి చేస్తారు. 
ఎయిర్ ఫోర్స్ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) 10th class ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌మెన్ (మ్యుజీషియన్) ఉద్యోగాలను కల్పిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఇది గ్రూప్-వై ట్రేడ్‌కు చెందింది. 

అర్హత కనీసం 45శాతం results తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 25సంవత్సరాలవారు అర్హులు. గిటార్, క్లారినెట్, వయోలిన్ లేదా ఇతర సంగీత వాయిధ్య పరికరాల ఘౌపయోగం తెలిసి ఉండాలి. శారీరక ప్రమాణాల్లో భాగంగా ఛాతి సాధారణ స్థితిలో157 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 80సెం.మీ. ఉండాలి. 

ఎంపిక ఇలా. మొదట రాత పరీక్ష, తరువాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు జరిపి ఎంపిక చేస్తారు. 
ఇండియన్ నేవీ భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) 10th class ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలు అందిస్తోంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఇందులో కుక్స్ కోసం ఆహార పదార్థాలు తయారు చేయగలిగేవారు. స్టీవార్డ్స్ కోసం ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. 

ఇంకా ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, టీఎన్‌పీఎస్సీ, అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ అధికారి, బంగ్లా వాచర్, ఠాగేదార్ పోస్టులకు 10th class అర్హత సరిపోతుంది.

Tuesday 26 April 2016

ఇంటర్‌లో సంప్రదాయ కోర్సులు

తొంబై శాతం మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేది దీనిలోనే. ఇంటర్ రెండేళ్ల కోర్సు. దీనిలో పలు గ్రూప్‌లు ఉంటాయి. ప్రధానంగా ఎంసెట్ కల్చర్ రాజ్యమేలుతున్న ఈ రెండు దశాబ్దాలుగా ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ కోర్సుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో కామర్స్ గ్రూప్‌లపై కార్పొరేట్ కన్ను పడటం. అదేవిధంగా మారిన ప్రపంచ నేపథ్యంలో ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లకు కొంత డిమాండ్ పెరిగింది.students01సీఏ, కంపెనీ సెక్రటరీ తదితర ఉన్నత హోదాగల ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ నుంచి సాధారణ కంపెనీల వరకు ఆడిటింగ్ డిపార్ట్‌మెంట్స్ ఏర్పాటుతో మంచి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో కామర్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే హెచ్‌ఈసీ వైపు ఈ మధ్య మొగ్గుచూపుతున్నారు. సివిల్స్, గ్రూప్స్‌లకు ఇంటర్‌లోనే పునాదులు వేసుకునేందకు సోషల్‌వైపు దృష్టిసారిస్తున్నారు.

పదోతరగతి విద్యార్థి భవిష్యత్ కోర్సు ఎంపికలోనే..

విద్యార్థి భవిష్యత్ అనేది తగిన కోర్సు ఎంపికలోనే ఉంటుంది. టెన్త్ వరకు అందరిదీ కామన్ చదువు. కానీ టెన్త్ తర్వాత పడే అడుగులు చాలా కీలకం. ఇక్కడ ఎన్నో దారులు ఉంటాయి. ఏ దారిలో వెళితే గమ్యం సరిగ్గా చేరుతామో చూసుకోవాలి. కోర్సు ఎంపికలో కింది అంశాలు బేరీజు వేసుకోవాలి.
1. విద్యార్థి అభిరుచి
2. విద్యార్థి స్థాయి (గత చదువును బట్టి అంచనా)
3. కుటుంబ పరిస్థితి (ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది చదువులను మధ్యలో మానేసిన వారు ఉన్నారు)
తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలు, అభిరుచులు కాకుండా, విద్యార్థి ఆసక్తులకు ప్రాధాన్య త ఇవ్వాలి. తల్లిదండ్రుల గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. బలవంతపు చదువులు చివరివరకు చేరవు అన్న విషయాన్ని గమనించాలి. ఒత్తిడితో కూడిన చదువులు విద్యార్థి మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.
కే. లలిత్ కుమార్, ఐఐటీ జేఈఈ ఫోరం, హైదరాబాద్